Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -06(అక్షరం న్యూస్ ) భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సహాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అన్నారు.వారి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన సందర్భంగా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రైతులతో కలసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల తో కలసి పాలాభిషేకం నిర్వహించారు టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ అన్నదాతలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 12 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అదే రోజు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా అదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సహాయం అందజేయనుందన్నారు. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు మంజూరు కూడా జనవరి 26 నుండి ప్రారంభం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily