Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ జనవరి.06/ అక్షరం లీగల్ న్యూస్: ప్రత్యేక వార్త కథనాలతో అక్షరం తెలుగు దినపత్రిక ప్రజల మన్ననలు పొందుతొందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పాటిల్ వసంత్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయంలో అక్షరం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఆవిష్కరించారు. ఈ సంద్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు పత్రికలు వారధిగా ఉంటూ...సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను రూపుమాపేందుకు కృషిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ భానుమతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, అక్షరం దినపత్రిక స్టాఫర్ ఎం.డి.ఫహీం, న్యాయవాదులు మెండు రాజమల్లు, యాసా యుగేందర్, ఉప్పుశెట్టి సునీల్, మారపాక రమేష్ తదిరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily