Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -06(అక్షరం న్యూస్ ) తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో భాగంగా ముస్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో హాజరు కావాలనుకునే విద్యార్థులు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం చదువుతున్న సంబంధిత పాఠశాల నుంచి బోనాఫైడ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 125 చెల్లించాలని, ఓసి విద్యార్థులు 200 రూపాయలు చెల్లించాలని తెలిపారు. అలాగే ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైటును సంప్రదించాలని సూచించారు.
.
Aksharam Telugu Daily