Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హేమచంద్రపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఆర్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ అని అన్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily