Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అంతర్జాతీయ మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూలిలైన్ లోని జిల్లా కార్యాలయం లో ఏ.యస్.జే. జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ కరీం అధ్యక్షతన సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏ.యస్.జే. చైర్మన్ యం.ఏ.రజాక్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మైనార్టీ హక్కులకు భంగం కలగకుండా చూసే భాథ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో ప్రభుత్వ న్యాయవాదుల, అదనపు ప్రభుత్వ న్యాయవాదుల (జి.పి.లు, అదనపు జిపిలు) నియామకాల్లో ముస్లిం మైనార్టీ న్యాయవాదులకు సముచితం స్థానం కల్పించాలని, కనీసం ఒక్క పోస్టు అయిన ముస్లిం మైనార్టీ లకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం లో కుడా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఇంత వరకు జి.పి లుగా ముస్లిం మైనార్టీలను నియమించలేదని గుర్తు చేశారు. కనీసం ఈసారి అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో జిపి, అదనపు జిపి నియామకాల్లో ఒక్క పోస్టు అయిన ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అహలే సున్నత్వల్ జామాత్ వైస్ చైర్మన్ మహమ్మద్ గౌస్, మోహినుద్దీన్, ప్రథాన కార్యదర్శిషేక్ యాకుబ్ ఖాద్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ శామీయుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్సేన్ ఖాన్,మహమ్మద్ షఫీ ఖాద్రి మహమ్మద్ అక్తర్ పాషా,షేక్ నయీమ్, మహమ్మద్ యాకుబ్ మహ్మద్ ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily