Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కోట్లాదిమంది తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నాయకురాలు సోనియమ్మ అని ఆమె తెలంగాణకు తల్లి లాంటిదని మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, ఐఎన్టీయూసి నాయకులు శంకర్ నాయక్ అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు జరిపారు. కేకు కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఏళ్ల తరబడి సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగితే చివరకు సోనియా గాంధీ ధైర్యంతో పార్లమెంటు తలుపులను మూసి తెలంగాణ ఇచ్చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని తెలంగాణను పాలించడానికి దశా దిశా మార్గ నిర్దేశం చేసిన మహనీయురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాంగ్రెస్ అండగా ఉంటుందని సోనియా ఓ తల్లిలా భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియా ఆరు గ్యారంటీలను ఇచ్చి మరింత భరోసా కల్పించారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమిష్టి కృషి వల్లే నేడు ప్రభుత్వం పదవుల్లో ఏర్పడిందని, ఇన్నేళ్లు కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, ఎన్నొ కేసులు ఎదుర్కొన్నారని.. కార్యకర్తలకు మాట ఇస్తున్నామని వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు లతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, పెదబాబు, ఐఎన్టీయూసి నాయకులు శంకర్ నాయక్, సెంట్రల్ రైల్వే బోర్డ్ సభ్యులు, కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి, తలుగు అనిల్, పరమేష్ యాదవ్, దిశ కమిటీ సభ్యులు ఆనంద్ రావు, సొ
-
Aksharam Telugu Daily