Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/నవంబర్ 6/అక్షరం న్యూస్ : అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం తన కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. కేటగిరీల వారీగా నిర్వహించిన ఈ వ్యాస రచన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతగా ఎంపిక చేయడం జరిగింది. ఎస్సై, ఆ పై స్థాయి అధికారులకు ఇచ్చిన అంశం "Sound mind in a sound body" లో మొదటి బహుమతి అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, రెండో బహుమతి షీ టీమ్ ఆరెఎస్సై రమాదేవి, మూడో బహుమతిని ఆర్ఎస్ఐ జగన్మోహనాచారీ లు గెలుచుకున్నారు. కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు ఇచ్చిన అంశం "My role in improving police image in Society" లో డి సి ఆర్ బి లో ఏఎస్ఐ గా పని చేస్తున్న రఘురాములు మొదటి బహుమతిని, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాందాస్ రెండో బహుమతిని, టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ రావ్ మూడో బహుమతిని గెలుచుకోవడం జరిగింది. విద్యార్థిని, విద్యార్థులకు ఇచ్చిన అంశం "Judicious Usage of Mobile phones" లో కొత్తగూడెం పట్టణంలోని శ్రీ ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్న కారుణ్య మొదటి బహుమతిని, పాల్వంచలోని శ్రీ సాయి స్ఫూర్తి DAV స్కూల్లో 8వ తరగతి చదువుతున్న యువతేశ్వరి రెండో బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో జిల్లా నుండి విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు అందుబాటులో ఉన్న విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు.
-
Aksharam Telugu Daily