Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ములుగు జిల్లా : ములుగు/వాజేడు/ వెంకటాపురం/ డిసెంబర్ 2/ అక్షరం న్యూస్:- ములుగు జిల్లా వాజేడు మండ లంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది.ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగాఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ కు వెళ్లినట్లు సమాచారం.సోమవారం ఉదయం వరకు హరీష్ ఉన్న గది తలుపులు తెరుచుకోక పోయేసరికి అనుమానంతో రిసార్ట్ సిబ్బంది పోలీస్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులు రిసార్ట్ కు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి తెరిచేసరికి పెరిరో రిసార్ట్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణం చెంది రక్తపు మడుగులో విగత జీవి గాపడి ఉన్నాడు.ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ హరీష్ ది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర పల్లి గ్రామం.సంఘటనా స్థలా నికి చేరుకున్న పోలీసు అధికా రులు ములుగు జిల్లా ఎస్పీకి సమాచారం అందజేశారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న జిల్లా ఎస్పీ శబరీష్,సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. హరీష్ ఆత్మహత్యకు పాల్ప డిన గదిని పరిశీలించి పోరె న్సిక్ నిపుణులతో ఆధారాలను సేకరించారు.వ్యక్తిగత కారణా లతోనే ఎస్ఐ హరీష్ ఆత్మ హత్యకు పాల్పడ్డారని తెలి పారు.కేసు నమోదు చేసుకొని ప్రత్యేక అధికారిని విచారణ అధికారిగా నియమించి ఆత్మ హత్యకు గల కారణాలను సేక రిస్తామని అన్నారు.వ్యక్తిగత కారణాలే కాక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.మరో వైపు ఎస్సై ఆత్మహత్య చేసు కున్న గది ముందు ఆయనతల్లి దండ్రులు,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల పిస్తుండడం హృదయ విదార కంగా కనిపించింది. వాజేడు మండలంలో విషాదం. 2022 బ్యాచ్ కి చెందిన హరీష్ ఉద్యోగం పొందిన మొదటిసా రిగా వాజేడులో ట్రైనీ ఎస్సైగా విధుల్లో చేరి కొద్ది నెలల్లోనే మండల పరిధిలోని పేరూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం పాటు పేరూరులో విధులు నిర్వర్తించి ములుగు వి ఆర్ కు బదిలీ అయ్యారు.మరలా 2024లో వాజేడు ఎస్సైగా విధుల్లో చేరారు. నాటినుండి నేటి వరకు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మృతి స్వభావిగా పేరుపొందిన వ్యక్తి ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో వాజేడు ప్రజలు విషాద వదనంలో మునిగిపోయారు.
.
Aksharam Telugu Daily