Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ డిసెంబర్ 2(అక్షరం న్యూస్) ఏజెన్సీలో నివసిస్తున్న ఎస్టి ఆదివాసీవాళ్ళతో సామాన్యంగా నేతకానికులకు సమాన హక్కులు గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తూ కాయ గడ్డం తింటూ పోడు వ్యవసాయంపై జీవనాన్ని కొనసాగిస్తున్న నేతకానిలకు తమ హక్కులు కల్పించాలని అలాగే ఐటీడీ తరహా నేతకానిలకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి విద్య ఉద్యోగ ఆరోగ్య రక్షణ కల్పించాలని ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న నేతకానిలకు పట్టాలు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్కకు కొత్తగూడలో జరుగుతున్న ప్రజా పాలన విజయోత్సవ సభలో వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జనగం నరేష్ జిల్లా నాయకులు రాజం సారంగం కాంగ్రెస్ పార్టీ గంగారం మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు జనగాం భద్రయ్య రాజం సాంబయ్య మండల బాధ్యులు చెన్నూరి మహేందర్ రామటేంకి శ్రీధర్ జాడి ప్రవీణ్ చెన్నూరు యాకబాబు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily