Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ తల్లాడ డిసెంబర్ 2 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ గ్రామపంచాయతీలో ఎవరైనా పర్యావరణానికి హాని కలిగించేలా చెట్లు నరికితే ఫైన్ వేయాల్సిన వారే చెట్లు నరికి పర్యావరణానికి హాని కలిగిస్తే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, తాసిల్దార్ ఎంపీడీవో గ్రామపంచాయతీ కార్యాలయాలకు వచ్చేవారు సేద తీరడానికి గతంలో మొక్కలు నాటారు సదరు మొక్కలు చెట్లు అయ్యాయి గ్రామపంచాయతీ అధికారి చెట్లను నరికించిన సంఘటన తల్లాడ లో చోటు చేసుకుంది, తల్లాడ గ్రామపంచాయతీ ఆవరణలో ఇటీవల ఈ సంఘటన చోటుచేసుకుంది కోలో కార్పస్ మొక్కలు నర్సరీలు ప్రకృతి వానములలో ఏపుగా పెరిగాయి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి అయినా వాటిని తొలగించకుండా కార్బన్డయాక్సైడ్ సేకరించి ఆక్సిజన్ విడుదల చేసే చెట్లను నరికించడం వివాదస్పదంగా మారింది రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయలు వచ్చింది నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తుండే అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం కోసం మెరుపు, డంపింగ్ యార్డ్ ఉన్న చెత్తను చెరువుల్లో వేయడం రోడ్ల పక్కనే దగ్ధం చేయడం, గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయాల్సి ఉండగా నిర్లక్ష్యంతో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడ చెత్త అక్కడే అన్న చందంగా పంచాయతీ కార్మికులు చెరువుల్లో డప్పు చేస్తున్నారు. పురవీధుల్లో చెత్తను దగ్ధం చేస్తున్నారు. చెత్తను సక్రమంగా సేకరించడం లేదు ట్రాక్టర్ వచ్చే సమయం సమాచారం ఇవ్వడం లేదని గృహిణులు ఆరంభిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులు, స్పందించి క్లీన్ తల్లాడ పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ ప్రజలు చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily