Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /రుద్రంపూర్ /30 నవంబర్ /అక్షరం న్యూస్: కొండంత రాగం తీసి ఇదేమిటి ఇలా చేశారు అంటూ యాజమాన్యంతో గుర్తింపు సంఘం ఏఐటియుసి స్ట్రక్చలర్ జరిగిందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు రాసూరి శంకర్ విమర్శించారు . శుక్రవారం నాడు కొత్తగూడెంలో జరిగిన సింగరేణి సివిల్ వాటర్ సప్లై కాంట్రాక్ట్ కార్మికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుంచి కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎంతో ఎదురుచూస్తున్నటు వంటి కాంట్రాక్ట్ కార్మికులకి తిరిగి వారికి అన్యాయం జరిగే విధంగానే తూతూ మంత్రంగానే సింగరేణి డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశం జరిగిందని కొండంత రాగం తీసి పిచ్చిగుంట్ల పాట పాడినట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఎంతగానో ఊరించి ఊరించి ఎక్కడ వేసిన గొంగళి అన్న విధంగా సింగరేణి డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్లో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు వారికి సంబంధించిన అనేక విషయాల మీద నాయకులు నిన్న జరిగినటువంటి డైరెక్టర్ మీటింగ్ లో కనీసం కాంట్రాక్ట్ కార్మికుల ఊసు కూడా ఎత్తలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచినటువంటి యూనియన్ స్థానిక ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సిపిఐ అధ్యక్షులు అయినటువంటి సాంబశివ గారు కనీసం సింగరేణిలో పనిచేస్తున్న 32,000 మంది కాంటాక్ట్ కార్మికుల భవిష్యత్తుని తెలిసిన గాని ఈ స్ట్రక్చర్ మీటింగ్లో ఎలాంటి చర్చను లేవనెత్తుకపోవటం చాలా బాధాకరమని ఆయన వాపోయారు. ఇప్పటికైనా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరో వస్తారు ఏదో చూస్తారు అని ఎదురు చూడ ఐకమత్యంతో అందరూ ఏకమై మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని ఆయన కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చా.రాబోయే రోజులలో కార్మికులందరినీ ఏకం చేసి 22 జీవో ఉద్యోగ భద్రత, ఐ ఎస్ ఐ వైద్యం, విద్య వీటన్నింటి మీద పోరుబాట పట్టే సమయం ఆసన్నమైందని కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మేడిపల్లి కరుణాకర్,కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు గూడలి యాకయ్య, కోశాధికారి అనిల్, సంఘం బాధ్యులు భాష బోయిన రవికుమార్, పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily