Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్, నవంబర్ 29(అక్షరం న్యూస్ ) చొప్పదండి మండలం గుమ్లాపూర్ లోని రైతు వేదిక లో రైతులు వరి కొయ్య కాలు కాల్చడం వలన కలిగే నష్టాలు పైన రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. వరి పంటలో కొయ్యకాలు కాల్చడం వలన భూమి లో ఉన్న పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోవడం జరుగుతుందని, తద్వారా పంటకు అందవల్సిన పోషకాలు అందకుండా పంట తగ్గిపోవడం , వాతావరణం లో వాయు కాలుష్యం పెరగడం జరుగుతుందని, కావున వరి కొయ్య కాల్చే బదులు రోటరీ మాల్చర్ ద్వారా దున్ని 100 కిలోగ్రాముల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవటం ద్వారా కొయ్యకాలు మురుగడం జరుగుతుందని, పంటకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి వీ. వంశీ కృష్ణ రైతులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో రైతులు, ఏఈవో సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily