Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : .. మెదక్, బ్యూరో, హత్నూర,నవంబర్,29( అక్షరం న్యూస్ ): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో వాల్ పోస్టర్ విడుదల చేసిన మాల ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బక్కన్న మాల మహానాడు సీనియర్ నాయకులు శాంత కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 1న మాలల సింహ గర్జనకు రాష్ట్ర నలుమూలలనుంచి మాల కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలి మాలలు అనేక రంగాలలో వెనుకబాటు గురయ్యారని తలపెట్టిన సింహ గర్జనకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ సత్తా చాటాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల ఉద్యోగుల సంఘ ఉపాధ్యక్షులు పుండరీకం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ కిష్టయ్య మాల మహానాడు మండల అధ్యక్షుడు పలంచ రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily