Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/నవంబర్ 28(అక్షరం న్యూస్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో నేడు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.7:30 గం.లకు వీరన్న గుట్ట పైకి వెళ్లే శాశ్వత మెట్ల మార్గానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కొత్తకొండలోని హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవో వీరేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలుగూరి రాజు తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్టంపల్లి ఐలయ్య పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily