Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : . మెదక్,బ్యూరో, హత్నూర, నవంబర్, 26( అక్షరం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు వడ్డేపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షులు ఎర్ర రాజు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం. స్వేచ్ఛ. మానవత్వం. అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949. నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా.ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం కూడా జరుపుకుంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ సలహాదారులు ఎర్ర యాదగిరి మరియు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు గౌడల్లి నాగరాజు ఉపాధ్యక్షులు ముక్కగల మహేష్ ముక్కుగల్ల ప్రవీణ్ సుదర్శన్. సిహెచ్ యాదగిరి శంకర్ విక్రమ్ కుమార్ సత్యనారాయణ శ్రీనివాస్ నాని చాకలి వీరేశం సతీష్ బిక్షపతి యాదగిరి డప్పు విజయ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily