Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : -చొప్పదండీ మున్సిపాలిటీకి అందచేత చొప్పదండి /కరీంనగర్, నవంబర్ 25 (అక్షరం న్యూస్ ) చొప్పదండి మున్సిపాలిటీ కి సోమవారం రోజున ఇప్పనపెల్లి చారిటేబుల్ ఫౌండేషన్ చొప్పదండి తరపున ఇప్పనపెల్లి శంకరమ్మ జ్ఞాపకార్థం వైకుంఠ రథంను అందచేశారు. సోమవారం రోజున చొప్పదండి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమం లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో ఈయొక్క వైకుంఠ రథం ను మున్సిపాలిటీ కి అందచేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ కమీషనర్ కె. నాగరాజు, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి,మాజీ జడ్పీటీసీ ఇప్పనపెల్లి సాంబయ్య, తహసీల్దార్ పీ. నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ జీ. అనూష, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily