Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి నవంబర్ 25 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మరియు పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. తో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన సిపికి మొక్కను ప్రజెంటేషన్ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ సందర్శించి రికార్డు లు చెక్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదు ల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులు కు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. సిబ్బంది తో మాట్లాడివారు చేసే విధులు మరియు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు వివరాలు, సిబ్బంది చేస్తున్న విధులు, పని తీరు అని అడిగి తెలుసుకున్నారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ఇక్కడ ఉండే ప్రజల గురించి, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, రాబోయే ఎన్నికల సంబందించి సమస్యత్మక గ్రామాలు, ట్రబుల్ మంగర్స్ వివరాలు ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడి లు, డిసి లు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, ఇంపార్టెంట్ పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. గ్రామాలలో, ప్రధాన కూడాళ్ళ వద్ద విజబుల్ పోలీసింగ్ ఉండాలి, ఆకస్మిక వాహన తనిఖీ లు నిర్వహించాలి. గంజాయి మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గూడెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామాలలోని ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది అదేవిదంగా ప్రజల తో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుని ప్రతిష్ట మైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. గంజాయి,మత్తు పదార్థాల, పిడియస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, చట్టం వ్యతిరేకమైన కార్యకలా పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ , సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి ఉన్నారు.
.
Aksharam Telugu Daily