Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 25 అక్షరం న్యూస్; రోజురోజుకు అధికారులు అవినీతి పెరిగిపోతుండడంతో ఏసీబీ అధికారులు కూడా తమ స్పీడ్ పెంచేశారు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు నిత్యం దాడులకు పాల్పడుతూ అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం ఉదయం ఎస్ఆర్‌సీ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్యక్తి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. .రూ.20,000 తీసుకుంటుండగా…. కాంట్రాక్టర్ చేసిన ఓ పని నిమిత్తం బిల్లు ఎంబి రికార్డు చేయడం కోసం ఏఈ నర్సింగరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో తమ్మడ బోయిన శ్రీనివాస్ యాదవ్ అనే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్టర్ తమ్మడ బోయిన శ్రీనివాస్ యాదవ్ రూ.20,000లు అందజేశారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయన్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
.
Aksharam Telugu Daily