Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : * శంకరపట్నం/ కరీంనగర్/నవంబర్ 24/ అక్షరం న్యూస్.. ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతన కార్మిక సంఘం ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య తెలిపారు.భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నూనె రమేష్,కార్యదర్శిగా రేగుల కుమార్,కోశాధికారిగా పల్లె రమేష్, కార్యవర్గ సభ్యులుగా అల్ల ధనుంజయ,పొన్నాల లక్ష్మణ్, మంద చంద్రమౌళి,బండారి భాస్కర్,కొలిపాక రామలింగం,నూనె ఐలయ్య,నూనె సదయ్య,రేగల రాజయ్య,బండి చంద్రయ్య,కొలిపాక శంకర్, సుద్దాల చంద్రయ్య,నూనె సమ్మయ్య లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ నూతనంగా అధ్యక్ష కోశాధికారిగా సభ్యులుగా ఎన్నికైన కార్మిక సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్మిక సంఘానికి కార్మికులు కలిసికట్టుగా పనిచేసి సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
.
Aksharam Telugu Daily