Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్,నవంబర్ 24(అక్షరం న్యూస్ ) చొప్పదండి మండలం లోని రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి కనకయ్య మొదటగా ఎస్సారెస్పీ కాలువలో ఉన్న శవాన్ని చూసి గుర్తించి రాగంపేట పంచాయతీ సెక్రెటరీ అనిల్ కి తెలుపగా,అనిల్ వచ్చి శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాగంపేట కాల్వలో దొరికిన శవం తాలూకు వివరాలు చెబుతూ శవం పూర్తిగా కూలిపోయి ఉన్నదని, ముఖం మొత్తం అస్థిపంజరం లాగా అయినందున గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నదని, మృతుని వయసు 40 నుంచి 50 మధ్యలో ఉంటుందని, ఒంటిపైన నలుపు రంగు కుట్టించబడిన ప్యాంటు ఉన్నదని,ఎవరైనా గుర్తిస్తే చొప్పదండి పోలీస్ స్టేషన్ కి వచ్చి వివరాలు తెలుపగలరని చొప్పదండి పోలీసులు తెలిపారు.
.
Aksharam Telugu Daily