Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -23(అక్షరం న్యూస్ ) ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని సి.ఐ మొగిలి పేర్కొన్నారు . శనివారం ముస్తాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చీకోడ్ గ్రామం లో నిర్వహించిన పోలీసు మీ కోసం కార్యక్ర మంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మోసాల కోసం రకరకాలుగా ఫోన్ కాల్ వస్తున్న వాటి గురించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కాలుకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, ప్రజలకు తెలియజేశారు. ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. బ్యాంక్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నేరాలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. అప్రమత్తంగా ఉంటూ వీటిని అరికట్టాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా స్మార్ట్ ఫోన్ లో వచ్చే ఓటీపీలు, మోసపూరితమైన యాప్స్ లను ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు.ఇటీవల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్ నిబంధనలు పాటించాలన్నారు. ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు. యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా నేరం జరిగితే నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షులుగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఇంటి యజమానులు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే భద్రతపరంగా బాగుంటుందని సూచించారు. నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువతి యువకుల పై వారి తల్లి తండ్రులు దృష్ఠి సారించాలని, వారి చదివే కళాశాల లకు వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. గ్రామ ల్లో పెద్ద మనుషులు పంచాయతీ లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ గణేష్, వీపీఓ సంతోష్, ప్రజలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily