Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ అశ్వరావుపేట/ 22 నవంబర్/ అక్షరం న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించారు.పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని,ఏమైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారుల సలహాలతో న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు.రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని,గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని సూచించారు.కోడిపందాలు,జూదం అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బందిని వర్టికల్స్ వారీగా వారి పని సామర్ధ్యాన్ని గురించి తెలుసుకున్నారు.ఎవరికి కేటాయించిన విధులను వారిని సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేసారు.విధులపరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట సిఐ కరుణాకర్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్సైలు యాయాతి రాజు,శివరామకృష్ణ,దమ్మపేట ఎస్సై సై కిషోర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily