Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ భద్రాచలం/ 22 నవంబర్ /అక్షరం న్యూస్: భద్రాచలం అభివృద్ధికి ఐదు పంచాయతీల సమస్య పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా గురువారం సుభాష్ నగర్ కాలనీ లో పర్యటించారు.ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలపాలని భద్రాచలం ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినా విలీన పంచాయితీల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు.పట్టణంలో సేకరించిన చెత్తను డంపు చేసేందుకు డంపింగ్ యార్డ్ లేకపోవడంతో కరకట్ట దగ్గర గోదావరి ఒడ్డున చెత్తను డంపు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.తెలంగాణ ప్రాంతం కోసం ఎట్టపాకలో ఏర్పాటుచేసిన జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో ఈ ప్రాంత వాసులకు పాలిటెక్నిక్ చదువు దూరమైందన్నారు.ఈ ఐదు మండలాల సమస్య పరిష్కారం అయితే తప్ప భద్రాచలం అభివృద్ధి సాధ్యమయ్యేలా లేదని,భద్రాద్రి దేవాలయానికి చెందిన 900 ఎకరాల భూములు ఆంధ్రలో కలవడంతో అభివృద్ది కుంటుపడిందన్నారు.భద్రాచలంలో విస్తీర్ణం లేకపోవడంతో ఇండ్లలోని చెత్తను కూడా బయట వేసుకోలేని సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గోదావరి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు భద్రాచలం గుర్తుకు వస్తుందని వరదల సమయంలో హామీలు ఇచ్చి మర్చిపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు.వరద ముంపు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,కరకట్ట ఎత్తును పెంచాలని,దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం ఆలయానికి 11 ఏళ్ళుగా కమిటీ నియమించక పోవడంతో అభివృద్ది కుంటుపడిందని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆలయ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షునిగా కొండ చరణ్ ను నియమించడం జరిగింది. ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్,జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,స్టాలిన్, వినోద్,కొప్పుల నారాయణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily