Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ 22 నవంబర్/ అక్షరం న్యూస్: కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేస్తున్నట్టు జీ.ఓ.177 ద్వారా ప్రభుత్వం కుడా కు ఆమోదం తెలపడంతో కుడా ఏర్పాటు అయితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందని భూక్యా సాయి కిరణ్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 32733/2024 ద్వారా సీనియర్ న్యాయవాది శ్రీ.జి.రవిచంద్ర శేఖర్ పిటిషన్ దాఖలు చేయగా నేడు హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్,పిటిషనర్ తరపున రవిచంద్ర శేఖర్,ప్రభుత్వం తరుపున గవర్నమెంట్ ప్లీడరు వాదనలు విన్న ధర్మాసనం సదరు గవర్నమెంట్ ప్లీడరు ను కౌంటర్ ద్వారా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కేసును 12-12-2024 కు వాయిదా వేసిందని సాయి తెలిపారు.కుడా ఏర్పాటుతో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కుడా వల్ల గ్రామీణ ప్రాంతాల వారు,ముఖ్యంగా గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.కుడా ఏర్పాటుతో జాతీయ ఉపాధి హామీ పథకం వారికి గొడ్డలి పెట్టులా మరే ప్రమాదం ఉందన్నారు.
.
Aksharam Telugu Daily