Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ నవంబర్ 21 అక్షరం న్యూస్ పెద్దపల్లి మండలం, దేవునిపల్లి గ్రామంలో సుప్రసిద్ధమైన శ్రీ. లక్ష్మి నరసింహ స్వామీ వారి రధోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రథోత్సవ వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు హాజరై తమ ఆరాధ్య దైవం లక్ష్మి నరసింహ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మహోత్సవంలో పాల్గొని కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు, గ్రామస్తులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.. తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల సాక్షిగా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు. తదుపరి ఎమ్మెల్యే విజయరమణ రావుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ అర్చకులు, ఆలయ డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, బొక్కల సంతోష్, తలారి సాగర్, శ్రీపతి సుమన్, మాజీ సర్పంచులు, గంట రమేష్, అదేపు వెంకటేష్,పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, నూగుళ్ళ మల్లయ్య, బూతగడ్డ సంపత్, బోడ్డుపల్లి శ్రీనివాస్, చిటి అశోక్, గొడ్డేటి రాజయ్య, చంద్రయ్య, గౌస్, గట్టయ్య, వెంకటేష్, అనిల్, కుమార్,,భక్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily