Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : , నవంబర్20(అక్షరంన్యూస్):ఉమ్మడి ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం గ్రామంలో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దశదినకర్మలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు సుమారు 2000మంది పైచిలుకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పినపాక నియోజకవర్గం లో అన్ని మండలాల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ గట్ల శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని భౌతికంగా శ్రీనివాస్ రెడ్డి లేనప్పటికీ చిరస్థాయిలో అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.నికార్సైన నిబద్ధత నిజాయితీ గల విలువలతో కూడుకున్నటువంటి ప్రజా నాయకుడు ఆయన అని ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు అన్నారు. ఆయన అకాల మరణం కార్యకర్తల నుండి మంత్రుల వరకు అందరినీ కలిచి వేసిందని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కొర్స ఆనంద్, సాయిని వెంకటేశ్వరరావు, బిజ్జా రామనాథం, మల్లయ్య, సిపిఐ నాయకులు బి.అయోధ్య, స రెడ్డి పుల్లారెడ్డి, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily