Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా నవంబర్ 20 (అక్షరంన్యూస్) వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైరా యుపిఎస్ హై స్కూల్ రెబ్బవరం జడ్పీ ఎస్ ఎస్ హైస్కూల్ నందు 20వేల రూపాయలు విలువైన స్పోర్ట్స్ కిట్టును జిల్లా యువత సాధికారత ట్రైనింగ్ క్లాసుల చైర్మన్ డిస్టిక్ చైర్ పర్సన్ మదన్ మోహన్ రేపాల ఆర్థిక సహాయంతో మంగళవారం అందించారు. ఈ కార్యక్రమానికి యుపిఎస్ హెచ్ఎం మల్లీశ్వరి జడ్పీహెచ్ఎస్ రెబ్బవరం హెచ్ఎం కొత్తపల్లి వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించాలని తద్వారా తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని పట్టుదలతో క్రమశిక్షణతో అనుకున్నది సాధించాలని అన్నారు. ఇటీవల ఖమ్మం లో జరిగిన స్వచ్ఛంద సంస్థల సమావేశంలో వైరా లయన్స్ క్లబ్బులు చేసే కార్యక్రమాలను స్వచ్ఛంద సేవలు చేసే కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను స్కూల్ కమిటీల ద్వారా స్వచ్ఛత సంస్థల ద్వారా చేపట్టాలని సూచించారని ఆయన తెలిపారు. అనంతరం రెబ్బవరం జడ్పీ ఎస్ ఎస్ లో స్కూల్ నందు 8 .9 10.తరగతల విద్యార్థులకు మదన్మోహన్ రేపాల విద్యార్థులకు యువత సాధికారత గురించి వివరించారు. విద్యార్థులు చదువుల్లో సక్సెస్ కావాలంటే ఆలోచనలు మంచిగా ఉండాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు యోగా వాకింగ్ సూర్య నమస్కారం చేసుకొని ఫిట్నెస్ గా ఉంటే చక్కని పౌష్టికాహారం కూడా తీసుకొని దృఢంగా ఉంటే మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయని అన్నారు. అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి దాని సహకారం చేసుకోండి అన్నారని అందుకే ప్రతి విద్యార్థి కలలుకని పట్టుదలతో సక్సెస్ కావాలి అని అన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలని ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలని మంచి బుక్స్ చదవాలని అన్నారు. ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినప్పుడే ఈ సమాజంలో కాంపిటీషన్లో తట్టుకోగలరని ఆయన సూచించారు. జీఎస్టీ కోఆర్డినేటర్ వుండ్రు శ్యాంబాబు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటుగా శారీరక దారుఢ్యం పెరుగుతుందని అన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని సూచించారు. అనంతరం స్పోర్ట్స్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు రీజియన్ చైర్మన్ డి పి సి రావు, జిల్లా జాయింట్ సెక్రెటరీ లగడపాటి ప్రభాకర్ రావు, జోన్ చైర్మన్ పెనుగొండ ఉపేందర్ రావు, లయన్స్ క్లబ్ సెక్రటరీ అబ్బూరి రమేష్, కోశాధికారి మరికంటి రాంగోపాల్, ఉపాధ్యాయులు శిరీష, ప్రేమలీల, జి సూర్య ప్రకాశరావు, దొడ్డ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily