Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *```~ ~ ఖమ్మం/ వైరా నవంబర్ 20 (అక్షరంన్యూస్) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య మున్నూరు కాపు సంఘం నాయకులు,కార్యకర్తలు ఏకమై మన వానిని వినిపించకపోతే మరి కొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో మన మున్నూరు కాపు కులస్తుల వాటాను గద్దలుల కొల్ల కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతున్నది...సోదరులారా మున్నూరు కాపులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 సంవత్సరములో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేకమంది నాయకులకు అవకాశాలు కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నూరు కాపు మెజార్టీ నాయకులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్రను పోషించారు.. సామాజిక న్యాయం నినాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అన్ని కులాల నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని గెలుపోటమును నిర్ణయించే శక్తి ఉన్న మున్నూరు కాపు నాయకులకు మెండుగా అవకాశాలు లభిస్తాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఎటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతము మరియు భవిష్యత్తులో కనిపిస్తాయని కొంతమంది నాయకుల తీరును బట్టి మనకు తేటతెల్లం అవుతుంది... గెలిచేదాక ఒక లెక్క, గెలిచాక ఒక లెక్క అని నాయకులు మున్నూరు కాపులను కూరలోని కరివేపాకు తీసివేసినట్లు,మా కుల నాయకులను తీసేస్తే..అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ఇప్పటికైనా మున్నూరు కాపు నాయకులు కార్యకర్తలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా రాజకీయ ముఖచిత్రంపై కాపు సంఘ నాయకుల ముద్రను పార్టీ పెద్దలైన పిసిసి అధ్యక్షులకు, ఢిల్లీ పెద్దలను కూడా కలిసి సమగ్ర వివరణ ఇవ్వటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి ఒక నివేదికను సమర్పించాలని మనవి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నూరు కాపు ఉద్యోగస్తులపై కూడా పోస్టింగుల విషయంలో వివక్షకు గురవుతున్నారని మా దృష్టికి వచ్చింది. మున్నూరు కాపులకు ఎన్నో అవకాశాలు కల్పించిన కెసిఆర్ లాంటి వ్యక్తుల్ని గద్దించటంలో కాపులు కీలక పాత్ర పోషించారు అది ఖమ్మం జిల్లాలోని నాయకులు అర్థం చేసుకోవాలి.. పద్ధతి మార్చుకోకపోతే అధికారం ఎవరికిశాశ్వతం కాదు కార్యదర్శి మున్నూరు కాపు యువజన సంఘం కట్ల సంతోష్ తెలిపారు.
.
Aksharam Telugu Daily