Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 19 అక్షరం న్యూస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసినందుకా మహిళలకు ఇచ్చిన హామీలు వృద్దులకు 4 వేల ఫించన్ ఇవ్వకుండా మోసం చేసినందకా రైతు భరోసా రుణమాఫీ రైతు భరోసా పేరుతో నట్టేట ముంచినందుకా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పల ఈశ్వర్ హైదరాబాదులో బిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ హైడ్రా పేరుతో వేల మందిని నిరుపేదల కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చినందుకా దళితులకు రెండో విడత దళితబంధు ఇవ్వనందుకా సంబురాలని అన్నారు గురుకులాల్లో 42 మంది విద్యార్థులు చనిపోయినందుకా చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభం అయినందుకా ఈ విజయోత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు ఆరు గారంటీలు 420 హామీల్లో ఏది పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి సంబరాలు చేసుకోవాలన్నారు కేసీఆర్ ను తిట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిలేదు అని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎడాపెడా హామీలు గుప్పించింది ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టి వాటికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్‌గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మద్దతు పలికారు వాటిని అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి హామీలు అటకెక్కాయని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదికి చేరువవుతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని అయిన విజయోత్సవాల పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
.
Aksharam Telugu Daily