Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : భద్రాద్రికొత్తగూడెం,పినపాక, నవంబర్19(అక్షరం న్యూస్): మండలంలోని తోగ్గూడెం పంచాయతీ తోగ్గూడెం గ్రామానికి చెందిన బాడిష ముత్తమ్మ (70) అనే వృద్ధురాలు ఇంట్లో థమ్స్ అప్ బాటిల్ లో ఉన్న గడ్డి మందును గుర్తించకుండా అది శీతల పానియం ధమ్స్ అప్ అనుకోని సేవించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు పినపాక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు .అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మణుగూరు వంద పడకల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ సభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాస్పిటల్ కి వెళ్లి వృద్ధురాలు ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వైద్యులతో బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
.
Aksharam Telugu Daily