Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 19 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగాఈరోజు తెలంగాణా రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ-శిశు,సంక్షేమశాఖ మంత్రివర్యులు- శ్రీమతి డాక్టర్ దనసరిఅనసూయ (సీతక్క)గారి ఆదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు- పైడాకులఅశోక్ గారి సూచనలమేరకు గంగారంమండలంలో జాడి వెంకటేశ్వర్లు గారు నివాళులర్పించారు ఇందిరా గాంధీ గారి జయంతి మంగళవారం ఉదయం పురస్కరించుకుని నిర్వహించుకునే జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు నెహ్రూ గారి నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారు దేశప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు పేదలు మహిళల అభ్యున్నతికి ఇందిరమ్మ విశేష కృషి చేశారని గుర్తుచేశారు భారతీయ శక్తికి మహిళలే ప్రతీకలు అన్న ఇందిరా గాంధీ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గారు ప్రస్తావించారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప నాయకురాలు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం, ఇందిరా గాంధీ గారు భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసిన ఒక మహా నాయకురాలని భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన ఒక మహా నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారని ఇందిరా గాంధీ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని *కొన్ని రోజుల్లో ఇందిరా గాంధీ గారి పేరుతో ఇందిరమ్మ ఇళ్ళను పేద ప్రజలకు అందజేసే కార్యక్రమం* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎవరైనా పాల్పడితే సహించేది లేదని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జెడ్పిటిసి వైస్ ఎంపీపీ సర్పంచ్ లు కాంగ్రెసు సీనియర్ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తతిదరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily