Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : కరీంనగర్/ నవంబర్ 18,అక్షరం (న్యూస్ ) తెలంగాణలోని మున్నూరు కాపు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పటేల్ యూత్ ఫోర్స్ వెబ్ సైట్ ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్, మున్నూరు కాపు జర్నలిస్టు పురం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ , పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్. రాజ్ కుమార్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో సోమవారం పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపకులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పటేల్ యూత్ ఫోర్స్ వెబ్ సైట్ నుప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వెబ్ సైట్ ద్వారా రాష్ట్రంలోని మున్నూరు కాపుల సమస్యలు పరిష్కరించడంతోపాటు అందరిని సమన్వయ పరుస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సభ్యత్వం చేయడమే లక్ష్యమన్నారు. యూత్ ఫర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్ర మహాసభ కరీంనగర్ లోని విజయవంతం చేశామని వివరించారు. క్రికెట్ టోర్నమెంట్ ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేశామన్నారు.యూత్ ఫోర్సు ద్వారా నిరంతరం సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. చదువులో ప్రతిభ కలిగి ఉండి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మున్నూరు కాపులకు సహాయం చేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. మున్నూరు కాపు యువతీ యువకులకు ఎలాంటి సలహాలు సూచనలైన ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పటేల్ యూత్ కు మెంబర్షిప్ కార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామినేని మధుసూదన్ పటేల్, కరీంనగర్ జిల్లా ఈసీ మెంబర్ చల్ల కృష్ణ,జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగ రమేష్, ప్రధాన కార్యదర్శి చందు పటేల్, కార్యదర్శి రాచమల్ల.సుగుణాకర్ పటేల్, పటేల్ యూత్ ఫోర్స్ రాష్ట్ర ఇంచార్జి సాయిచరణ్ పటేల్ తోట, సభ్యులు అభిషేక్ పటేల్, రాము పటేల్ ,గాజుల శ్రీనివాస్ పటేల్,కాంతి పటేల్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily