Monday, 10 February 2025 07:44:12 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ..బోగస్ ప్రచారం నమ్మకండి

ఇదిగో సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్. *• రైతుల ఖాతాల్లో డబ్బులు *• ప్రతి గింజను కొనుగోలు చేస్తాం *• రైతులు సెంటర్లలో రషీదులు తీసుకొని వెళ్ళండి. *• కటింగ్ లేకుండా ప్రతి గింజకు మద్దతు ధర చెల్లిస్తాం *-ఎమ్మెల్యే విజయరమణా రావు


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 November 2024 03:48 PM Views : 188

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 18 అక్షరం న్యూస్; మొదటినుంచి రైతుల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రైతు రుణమాఫీ పై సన్నాలకు 500 రూపాయల బోనస్ పై విపక్షాలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మదని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికీ సన్న వడ్లు విక్రయించిన రైతులకు 500 రూపాయల బోనస్ రూపంలో పడిందని ఆయన తెలిపారు. ఐదు ఐదు క్వింటాళ్ల వరకే సన్న వరి ధాన్యానికి 500 రూపాయలు బోన్స్ వస్తుందని మిగతా వారికి అది వర్తించదని కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మదని వెయ్యి క్వింటాళ్ల వరి ధాన్యం పండించిన రైతులకు కూడా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్ను సోమవారం రోజున స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు సన్న వడ్లు సాగు చేసుకున్న రైతులకు క్వింటాలుకు 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానకాల పంటకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. రైతుల ఖాతాలో బోనస్ పడుతున్న కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. రైతుల ఖాతాలో బోనస్ పడడం ప్రారంభమైందని రైతులెవరు అదేర్య పడవద్దని సన్నవడ్లు సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి బోనస్ అందుతుందన్నారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు.రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అలాగే ఎలాంటి వడ్ల కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తనది అన్నారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. నాణ్యమైన నిర్ణీత మ్యాచరు 17 తో కూడిన వడ్లను తీసుకువచ్చే బాధ్యత రైతులదని అన్నారు. సెంటర్లలో వడ్లను కాంట వేసిన అనంతరం రైతులు రసీదులు కొంది నిరంధిగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. సెంటర్ల ఇన్చార్జిలు ఏలాంటి తేడాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది చేసేది లేదని స్పష్టం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగ్ పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల వడ్ల కటింగ్ లకు స్థానం లేకుండా చేశామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నంతకాలం ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మాదిరెడ్డి నర్సింహా రెడ్డి, పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వాణాధికారి మెట్టు మదన్మోహన్, నాయకులు సంపత్ రావు,మాజీ సర్పంచ్ కనపర్తి ప్రభాకర్ రావు,గన్నమానేని తిరుపతి రావు, రమేష్ , సతీష్,మరియు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :