Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : *• పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 18 అక్షరం న్యూస్; మొదటినుంచి రైతుల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రైతు రుణమాఫీ పై సన్నాలకు 500 రూపాయల బోనస్ పై విపక్షాలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మదని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికీ సన్న వడ్లు విక్రయించిన రైతులకు 500 రూపాయల బోనస్ రూపంలో పడిందని ఆయన తెలిపారు. ఐదు ఐదు క్వింటాళ్ల వరకే సన్న వరి ధాన్యానికి 500 రూపాయలు బోన్స్ వస్తుందని మిగతా వారికి అది వర్తించదని కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మదని వెయ్యి క్వింటాళ్ల వరి ధాన్యం పండించిన రైతులకు కూడా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో
.
Aksharam Telugu Daily