Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -17(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామము లో ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన పోతి రెడ్డి నారాయణ కుటుంబానికి పలువురు సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు..మృతుని కుటుంబం నిరుపేదలు కావడంతో మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు కావడంతో వారి కుటుంబాన్ని గ్రామ హమాలీ సంఘం సభ్యులు పరమర్శించారు. మృతుని కుటుంబం కు 50కిలోల బియ్యం తో పాటు రూ.1500రూపాయలు అందచేశారు. అలాగే ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల రమేష్ గౌడ్ స్థానిక బీజేపీ నాయకుల తో కలసి నారాయణ కుటుంబాన్ని పరమర్శించారు. వారి కుటుంబం కు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబం కు 50కిలోల బియ్యం వితరణ చేశారు ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిరుపేద కుటుంబాలకు మేమే కాకుండా ఇతర యువకులు కూడా ఆదర్శంగా తీసుకొని సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలు మేము రాజకీయం కోసం కాకుండా కేవలం సేవగానే భావించి చేస్తున్నామని తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నారాయణ కుటుంబం కు సాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం సభ్యులు,బీజేపీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉరడి రాజు, మహేష్, నవీన,రంగయ్య అనీష్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily