Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ములుగు జిల్లా : ములుగు జిల్లా/ తాడ్వాయి/ నవంబర్ 17 (అక్షరం న్యూస్)ఈరోజు సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం జాతర మండలంలోని ఊరటం గ్రామంలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆటవస్తుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ తో పాటు ఎటూర్ నాగారం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య గారు మాట్లాడుతూ చదువుకునే ప్రాయంలో పిల్లలకు చదువుతోపాటు వ్యాయామ విద్య వ్యాయామము ఎంతో అవసరమని చెప్పారు ప్రతిరోజు ఉదయం వ్యాయమం చేయడం ద్వారా శరీరం యాక్టివ్ గా ఉండడంతో పాటు మన మెదడు కూడా యాక్టివ్ గా పనిచేస్తుందని తెలియజేశారు కాబట్టి బాలికలంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయమం చేయడం తమ జీవితంలో భాగంగా ఉండాలని తెలియజేశారు అదేవిధంగా ఈ సందర్భంగా కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ గారు మాట్లాడుతూ నా యొక్క తండ్రి గారైన కోల సైదులు గారి యొక్క కోరిక మేరకు మా నాన్నగారు కష్టించి సంపాదించిన దానిలో నుండి కొంత భాగం నా పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని మా నాన్నగారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాలు కె ఎస్ ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు అత్యంత మారుమూల ప్రాంతమైన ఈ ఊరటంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఆట వస్తువులను పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని తెలియజేశారు నేను ఇటువంటి కార్యక్రమాలు మునుముందు చేయడానికి మీరు మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ తండ్రిగారైన కోలా సైదులు గారు మరియు కన్నాయిగూడెం సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు తాడ్వాయి మండల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహ్మద్ రఫీ సర్ప రవీందర్ మైపతి సంతోష్ ముదురుకోళ్ల చందు జనగాం కిరణ్ గ మరియు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాలుగు క్యారం బోర్డులు రెండు వాలీబాల్ 20 షటిల్ బ్యాట్స్ 20 రింగ్స్ 50 స్కిప్పింగ్ రూల్స్ రెండు చెస్ బోర్డులు మరియు పాఠశాలకు సరిపోవు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily