Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : • భద్రాద్రి జిల్లా/ పాల్వంచ/ నవంబర్.16/ అక్షరం న్యూస్: పాల్వంచ మండలంలోని సోములగూడెం గ్రామంలో నివసిస్తున్నటువంటి పెద్దినేటి అనసూర్య అనే మహిళ గత ఆదివారం నాడు తనకు ఉన్నటువంటి అర ఎకరం పొలంలో వరికోత మిషన్ తో వరి కోపిస్తూ ఉండగా మిషన్ డ్రైవరు వెనక చూసుకోకుండా రివర్స్ రావడంతో ఆమె పైనుండి వరి కోత మిషను వెళ్లడంతో ప్రమాదవశాత్తు మరణించినది. మరణించినటువంటి ఆమె మున్నూరు కాపు కుల సంఘ సభ్యురాలు, అనసుర్య ది నీరుపేద కుటుంబం , ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం కార్యవర్గం దృష్టికి రావడంతో వ్యవస్థాపక అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, మరియు మున్నూరు కాపు నాయకులు చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని సత్తిబాబు, బాలినేని నాగేశ్వరరావు ల ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అండగా నిలబడాలని వారి వంతుగా కొంత నగదును సమకూర్చి మున్నూరు కాపు దాతల సహకారంతో రూ .69 వేల రూపాయలను సమకూర్చి శనివారం పెద్దినేటి అనసూర్య కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పెద్దినేటి అనసూర్య ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరమని, ఆమె మరణం వారి కుటుంబానికి తీరని లోటని, గతంలో సంవత్సరంనర క్రితం పెద్దినేటి అనసూయ భర్త పెద్దినేటి లక్ష్మయ్యకు యాక్సిడెంట్ అయి కుడికాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యి పాల్వంచలోని శ్రీ భాగ్య హాస్పిటల్ కి వైద్యం నిమిత్తం వెళ్ళగా అక్కడి డాక్టర్ కాలు బాగా డ్యామేజ్ అయినది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లమనగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు తమకు ఈ విషయం తెలుపగా ,తాము అప్పటి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తో మాట్లాడి ఖమ్మంలోని సృజన్ హాస్పిటల్ కు అంబులెన్స్ మాట్లాడి పంపించి సుమారు 6 లక్షల రూపాయల వరకు అయినటువంటి వైద్య ఖర్చులను ఉచితంగా చేయించడం జరిగిందని, అలాగే సంవత్సరం క్రితం పాల్వంచ మండలం కేపీ జగన్నాధపురం లో నివసిస్తున్నటువంటి శ్రావణపు పెద్దయ్య అనే వ్యక్తి మరణించగా వారిది పేద కుటుంబమని మున్నూరు కాపు కుల దాతల సహాయ, సహకారాలతో శ్రావణపు పెద్దయ్య కుటుంబానికి రూ .46 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, పాల్వంచ పట్టణ మండల ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడంలో తమ తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బాలినేని సత్తిబాబు, బాలినేని నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వేశ్వర రావు, మేడిశెట్టి సాంబశివరావు, గోవాడ రవి, గల్లా శోభన్ బాబు, ముళ్ళపాటి శ్రీకాంత్, జమ్ముల శివ, బాలినేని వీరయ్య, పూజల ప్రసాద్, మూలగుండ్ల ప్రేమ్ కుమార్, ఎలికే వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily