Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : భద్రాద్రి కొత్తగూడెం,పినపాక, నవంబర్ 16(అక్షరం న్యూస్): ఏడూల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాలతో ఎస్సైఇ .రాజ్ కుమార్ శనివారం కొన్ని గ్రామాలలో పర్యటించారు.పినపాక గ్రామంలోని రైతులతో మాట్లాడారు. రోడ్ల పైన ధాన్యాన్ని ఆరబెట్టడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటుందని రాత్రి పగలు ప్రయాణాలు జరుగుతూ వుంటాయి కుప్పలుగా రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఉండడంవల్ల ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగి మరణించే అవకాశం ఉన్నందున రైతులు ఎవరూ కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకూడదని అన్నారు. ధాన్యాన్ని తమ పొలాలలో ఆరబెట్టుకోవాలి అని లేదా ధాన్యం కేంద్రాల వద్దకు తరలించాలని సూచించారు.రోడ్లపై ధాన్యాన్ని ఉంచిన రైతులు త్వరగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. రైతులు అందరూ సహకరించాలని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
.
Aksharam Telugu Daily