Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : భద్రాద్రికొత్తగూడెం,పినపాక, నవంబర్ 15(అక్షరం న్యూస్):కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. చింతబయ్యారం,సీతం పేట ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమ శివుడికి ఇష్టమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు గుడ్లు ప్రసాదాలు సమర్పించారు. రాత్రి వేళ శివాలయాలలో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తూ వారి కోరికలు తీరాలని భగవంతుని ప్రార్థించారు. వేల సంఖ్యలో కార్తీక దీపాలు వెలగడంతో భక్తులు ఆ దీపపు కాంతులతో పరవశించగా శివాలయ ప్రాంగణమంతా శివనామ స్మరణంతో మార్మోగింది.ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
.
Aksharam Telugu Daily