Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/నవంబర్ 15(అక్షరం న్యూస్): గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముల్కనూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం ఎస్సై సాయిబాబు సిబ్బందితో హుస్నాబాద్ రోడ్డుపై సమ్మక్క గుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇద్దరితో వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఒడిషా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా బేరిఖాన్ పల్లికి చెందిన ఫణి తనప్తార్, సుభాష్ హల్దార్ లపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. గంజాయిని హైదరాబాదుకు తరలిస్తున్నారని, గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
.
Aksharam Telugu Daily