Monday, 10 February 2025 07:15:44 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

బాలలే భారత భవిష్యత్ అన్న వ్యక్తి మన చాచాజి... -ఎక్సలెంట్ భాష స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఐ వెంకటేశ్వరరావు, ఎంఇఓ నాగయ్య.. - ఎస్సై ఇ.రాజ్ కుమార్, రాజేందర్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 15 November 2024 03:00 PM Views : 299

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ... - భద్రాద్రి కొత్త గూడెం, పినపాక, నవంబర్15(అక్షరం న్యూస్ ): మండలంలోని ఇ.బయ్యారం క్రాస్ రోడ్డు ఎక్స్ లెంట్ భాషా హైస్కూల్లో గురువారం భారత మొదటి ప్రధాని చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇ. బయ్యారం సిఐ వెంకటేశ్వర్ రావ్, విశిష్ట అతిథులుగా ఎంఈఓ నాగయ్య, బయ్యారం ఎస్సై ఇ. రాజ్ కుమార్, కరకాగూడెం ఎస్సై రాజేందర్, ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్, కరస్పాండెంట్ ఖాదర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఐ వేంకటేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు. ఇష్టపడి చదువే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని , క్రమశిక్షణతో చదివి చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకొని పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సెల్ ఫోన్ కు ఎక్కువగా ఆకర్షితులయ్యారని, దానివలన మంచి కంటే చెడు ప్రభావం పిల్లలపై ఉంటుందని అన్నారు. కావున విద్యార్థులను సెల్ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ వేడుకలకు విశిష్ట అతిధులుగా హాజరైన పినపాక ఎం.ఇ.ఓ. నాగయ్య మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలైన పినపాక, కరకగూడెం మరియు మంగపేట మండలాలలోని పేద విద్యార్థులకు ఎక్స్లెంట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సాధారణమైన విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. అనంతరం ఇ. బయ్యారం ఎస్సై ఇ. రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వత్తిడి ని తొలగిస్తాయి అని అన్నారు. తల దించుకొని చదివి తల ఎత్తుకొని బ్రతకాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ముఖ్యంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న దేశ నలుమూలలలో ప్రతి ఒక్క పాఠశాలలో ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారని అన్నారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తి చాచా నెహ్రూ అన్నారు.నేటి బాలురే రేపటి పౌరులనే నినాదం తో పిల్లల పై ప్రేమానురాగాలు చూపిన భారత దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని విద్యార్థులకు బాలల దినోత్సవ విశిష్టతను తెలియజేశారు. విద్యార్థి దశ చాలా కీలకమైనది అని చాలా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కరక గూడెం ఎస్సై రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని అన్నారు. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గురువులను భక్తి శ్రద్ధలతో గౌరవించిన వారు జీవితంలో వారి లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు.విశిష్ట అతిథులుగా హాజరై న ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ విద్యార్థులను ఉద్దేశించ ప్రసంగించారు.అనంతరం గత నాలుగు రోజుల నుండి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించగా విజయం సాధించిన విద్యార్థులకు అతిధుల ద్వారా బహుమతులను అంద చేశారు. ఈ వేడుకలలో విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ మరియు డైరెక్టర్లు కలిసి పాఠశాలలోని బోధన మరియు బోధ నేతర సిబ్బందిని శాలువాతో సత్కరించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమానికి ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు యాకూబ్ షరీఫ్ , నర్సారెడ్డి గారు, నరేంద్ర గారు, ప్రిన్సిపాల్ సురేష్ , సీనియర్ ఫ్యాకల్టీ వలసల మోహన్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :