Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : - రాజన్న సిరిసిల్ల/ జిల్లా స్టాపర్/ నవంబర్ 14 (అక్షరం న్యూస్): మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా రవి గౌడ్ సిరిసిల్ల తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో రైతులు ప్రజలు తిరగబడితే ఎలాంటి సంబంధం లేని మాజీ బిఆర్ఎస్ ఎంఎల్ఏ నరేందర్ రెడ్డి నీ అమానుషంగా అక్రమంగా మఫ్టీలో వచ్చి ఒక తీవ్రవాదిలా ఒక టెర్రరిస్టులా అరెస్టు చేసి ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేయడం రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు చేర్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడంతో కేటీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన గాలికి వదిలేసి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం తప్ప మరోకటి లేదని దుయ్యబట్టారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా మీ ప్రజాపాలనా..! అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని మీ బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదని ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని అన్నారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, కాసార్ల మహేందర్ మరియు నాయకులు ముషుకే, అనిల్ గౌడ్, దేవరాజు, మార్గం కార్తికేయ, వెంకటేష్, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily