Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలోని 39 కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. 13478 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. అభ్యర్థులు సకాలంలో చేరాలని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, బ్యాగులు నిషేధమని తెలిపారు. బయోమెట్రిక్ విధానం కారణంగా మెహందీ, టాటూలు పెట్టకుండా ఉండాలని సూచించారు.
-
Aksharam Telugu Daily