Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/నవంబర్ 14(అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలం సముద్రాలలింగపూర్,గోరంటల గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నా జిల్లా ఎస్పీ.అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులుదృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ శ్రీనివాస్,సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily