Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/భీమదేవరపల్లి : హనుమకొండ/భీమదేవరపల్లి/నవంబర్ 13(అక్షరం న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ లో టెండర్ కు బహిరంగ వేలం నిర్వహించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రుడి ఆలయంలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించే జాతర నేపథ్యంలో బుధవారం వేలం పాటలు జరిగాయి. తలనీలాలు సేకరణ హక్కుకు కొలిపాక కొమురయ్య రూ.16,000, ఎండు కొబ్బరి ముక్కలు, బియ్యం, బట్టలు, చీరలు సేకరణ హక్కులకు ఎర్రం శెట్టి ఉపేందర్ రూ.2,66,000, కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కు ఎర్రం శెట్టి ఉపేందర్ రూ.2,12,000, కోర మీసాలు, గుమ్మడికాయలు అమ్ముకొను హక్కు బుర్ర రంజిత్ రూ.9,02,000, ఒక సంవత్సర కాలం పాటు కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అమ్ముకొని హక్కు కేశెట్టి సంతోష్ రూ.10,88,000, పార్కింగ్ హక్కు సిద్ధమల్ల వెంకటేష్ రూ.47,000, పుట్నాలు, పేలాలు అమ్ముకొని హక్కు కేశెట్టి సంతోష్ రూ.15,500 లకు హక్కు పొందారు. తడకలు, పందిళ్లు వేసేందుకు రెడ్డి సంపత్ రూ.60 వేలు, విద్యుత్ దీపాలంకరణకు నిరంజన్ రెడ్డి రూ.1,04,000 లకు తక్కువ కొటేషన్లు వేసి హక్కులు పొందారు. వేలం పాటలు పూర్తయిన అనంతరం ఆలయ ఈవో పి.కిషన్ రావు మాట్లాడుతూ 2024 సంవత్సరం కంటే 2025 జాతరకు పూర్తి టెండర్లు మొదటి దశలోనే పూర్తయినట్లు తెలిపారు. గత జాతర వేలం పాటలతో పోలిస్తే ఈసారి రూ.6,69,800 ఎక్కువ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, గ్రామస్తులు పిడిశెట్టి కనకయ్య, పూదరి రవీందర్, గాజుల సతీష్, యాటపోలు శ్రీనివాస్, కంకల సమ్మయ్య, సిద్ధమల్ల వెంకటేష్, సమ్మయ్య, కొక్కెర కొండ రాజు, రంజిత్, ఆలయ అర్చకులు రాజయ్య, మొగిలిపాలెం రాంబాబు, సందీప్, సిబ్బంది రవీందర్, నారాయణరావు, శ్రీధర్, రాజకుమార్, రాజేందర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily