Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/నవంబర్ 13(అక్షర న్యూస్) ముచ్చర్ల గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన మెతుకు పోషవ్వ కుమారుడు మెతుకు శ్రీనివాస్ గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.అతడికి భార్య నర్సవ్వ ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అయితే పోషవ్వ కు 5 గురు కూతుర్లు ఉన్నారు.వారు పోషవ్వ కోడలు నర్సవ్వ ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా వ్యవసాయ భూమిని పోషవ్వ 5 గురు కూతుర్లు తమ తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంటిని,ఇంటి పక్క కళి స్థలాన్ని వేరే వాళ్లకి అమ్ముకున్నారు.ఇది అన్యాయం అని తలచిన కులస్తులు పోషవ్వ కుతుర్లని ఒప్పించి స్థలాన్ని,ఇంటిని తిరిగి నర్సవ్వకి ఇప్పించే ప్రయత్నం చేసారు. వారు ససేమిరా అనడంతో ఇట్టి విషయాన్ని స్థానిక ఎం.ఆర్.ఓ దృష్టికి తీసుకెళ్లారు.నర్సవ్వ పిర్యాదు మేరకు విషయాన్ని పరీశీలించి నర్సవ్వకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు
.
Aksharam Telugu Daily