Monday, 10 February 2025 06:44:20 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ .

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 November 2024 06:06 PM Views : 212

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ 13 నవంబర్/ అక్షరం న్యూస్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌ – 3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. నవంబర్ 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 39 కేంద్రాలలో 13478 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపర్డెంట్లు 39 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 39, ఫ్లయింగ్ స్క్వాడ్ 12,అభ్యర్థులను గుర్తించుటకు గాను 148 మంది అధికారులు, రూట్ ఆఫీసర్లు 12, అబ్జర్వర్లు 40 మంది వీరు కాక స్టేట్ నుండి కూడా అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతీ కేంద్రంలో సి.సి.కెమరాలు ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల్లో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్‌ చేయాలని తెలిపారు. కేంద్రానికి ప్రహారీ గోడ లేనట్లయితే అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటుతో పాటు బయో మెట్రిక్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించే ముందు వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపించాలని, మగ, ఆడ అభ్యర్థులను విడివిడిగా తనిఖీ చేయాలని అన్నారు. ప్రతీ కేంద్రంలో సి.సి.కెమెరాలు, ఫర్నిచర్‌, త్రాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్‌ టీమ్‌ ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్లను నియమించుకోవాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సమయానుకూలంగా పరీక్షకు ముందు, పరీక్ష అనంతరం ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌ ను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విద్యుత్‌ అధికారులను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతీ సెంటర్‌ లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తో పాటు ఏ.ఎన్‌.ఏం. లను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అభ్యర్థులు టిజిపిఎస్‌సి పోర్టల్‌ నుండి హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్‌ నిర్వహించాలని మున్సిపల్‌ కమీషనర్‌ను ఆదేశించారు. అలాగే కేంద్రాల్లో ఎలాంటి పోస్టర్లు, హార్డింగ్స్‌, ప్రచార సామాగ్రి లను తొలగించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను పరీక్షల నిర్వహణ సమయంలో మూసివేయించాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్ష హాలులోకి ఎవరిని కూడా సెల్‌ ఫోన్‌ అనుమతించబోమని, కేవలం చీఫ్‌ సూపరింటెండెంట్‌ లకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులను పరీక్ష కేంద్రల్లోకి అనుమతించకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి అర గంట ముందే హాజరు కావాలని, సెల్‌ ఫోన్‌, క్యాలికులేటర్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, గాడ్జెస్‌ లను, ఎలాంటివి పరీక్ష హాలులోకి అనుమతించబోమని అదనపు కలెక్టర్‌ స్పష్టం చేశారు. పరీక్షలను సాఫీగా ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. సమీక్ష సమావేశం అనంతరం పరీక్షల నిర్వహణకు విధులు నిర్వర్తించే అధికారులకు, అబ్జర్వర్లకు పరీక్షా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏ ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్ హరికృష్ణ, జిల్లా అధికారులు, చీఫ్ సూపర్డెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, అబ్జర్వర్లు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :