Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి నవంబర్ 13 అక్షరం న్యూస్; పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ సహకార శాఖ అధికారి శ్రీ మాల బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. పిఎసిఎస్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, సీఈవో మదన్మోహన్ కొమ్ము సుధాకర్, ఎక్స్ సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily