Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కోత్తగూడెం జిల్లా గుండాల నవంబర్ 13 (అక్షరం న్యూస్) గుండాల మండలం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మాజీ దళకమండర్, దేవలగూడెం గ్రామ కమిటీ సభ్యులు కామ్రేడ్ ఈసం కోటన్నకు ఆదివారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం ఆస్పత్రికి న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, చేరుకొని (సురక్ష ప్రైవేట్ )ఆసుపత్రి కి తరలించారు*. అప్పటికే కామ్రేడ్ కోటన్న ఆరోగ్యం బాగా దెబ్బతింది. స్కానింగ్ తీస్తేమెడనరాలు చిట్లిపోయినాయి, మెదడులో రక్తం గడ్డ కట్టి బాగాతిన్నది. ఈ రిపోర్ట్స్ ను వివిధ న్యూరో సర్జన్ డాక్టర్లకు చూపించినప్పటికీ ఫలితం లేదని తేల్చారు. బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన ఈసం కోటన్నకు విప్లవ జోహార్లు. అమరహై ఈసం కోటన్న జోహార్లు ఈసం కోటన్నకు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ గుండాల మండల కమిటీ ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily