Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ పాల్వంచ/ 10 నవంబర్/ అక్షరం న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడుగా భాద్యతలు నిర్వహిస్తున్న కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ను పార్టీ భాద్యతలు,పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు,నూతనంగా పట్టణంలోని గోవర్ధనగిరి కాలనీకి చెందిన జెట్టి ఆనందరావును పట్టణ అధ్యక్షుడుగా నియమిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు తెలిపారు.ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ,ఎంతోమంది మహనీయులు వారి వైవాహిక జీవితాన్ని,కుటుంబాలను త్యాగం చేసుకుంటే ఈరోజున మనం ఇలా జీవిస్తున్నమని,భారత రాజ్యాంగమే ఎన్నికల మ్యానిఫెస్టో గా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని అటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతందన్నారు.పట్టణ అధ్యక్షుడుగా భాద్యతలు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు సమయం ఇవ్వడం లేదని,ఇప్పటివరకు కమిటీల నిర్మాణం చేయలేదని,పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించలేదని సభ్యత్వ నమోదు తేది నిన్నటితో ముగిసినందున అతను పార్టీ సభ్యత్వం కూడా తీసుకొనందున పార్టీ నుండి,పార్టీ బాధ్యతల నుండి బహిష్కరించడం జరిగిందని,ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా భాద్యతలు నిర్వహించి రిటైర్ అయిన జెట్టి ఆనందరావును నియమించడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఈసం మురళి,తేజ,కమల్,అంకుష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily